BREAKING NEWS: 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలోనూ పలువురు యూట్యూబర్లపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.