హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ గారూ... సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా, "మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ గారు.. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా" పోస్టు చేశారు. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడంతో, ఇటు వైసీపీ అటు టీడీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.