సీబీఎస్ఈ పరీక్షల్లో భారీ మార్పులు.. విద్యార్థులకు కష్టకాలమే!
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో చూచి రాతలకు చెక్ పెట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. సీబీఎస్ఈ సబ్జెట్స్ బోధించే అన్ని పాఠశాలలు ఈ విధానాల్ని తప్పనిసరిగా అమల్లో పెట్టాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ జాగ్రత్తల వల్ల పరీక్షల్లో అక్రమాలు, మోసాన్ని అరికట్టేందుకు వీలవుతుందని బోర్డు అభిప్రాయపడింది
. విద్యార్థులు స్వతహాగా వారి తెలివితేటలతో పరీక్షల్లో పాల్గొనాలి. ఎవరి కష్టానికి తగ్గట్లు వారు తర్వాతి తరగతుల్లో ప్రయోజనం పొందాలి.. అందుకే CBSE ఆన్సర్ షీట్ లో ఈ ఏడాది 2025 నుంచి గణనీయమైన మార్పులను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని, పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి ఈ మార్పుల గురించి తెలుసుకోవాలని సూచించింది.
ఇకపై సీబీఎస్ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎవరి సమాధాన పత్రానికి వారికే ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండనుంది. దీని ద్వారా ఆయా విద్యార్థుల పేపర్ ట్రాకింగ్ మరింత సులువు కానుంది. పరీక్షల సమయంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా నిరోధించేందుకు సహాయపడుతుందని అంటున్నారు. విద్యార్థులు ప్రశ్నలకు సంబంధించిన సంఖ్యలను ఆన్సర్ షీట్ లోని మార్జిన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మధ్యలో, కుడి వైపు మార్జిన్లలో రాస్తే చెల్లదని బోర్డు తెలిపింది.
ప్రశ్నాపత్రంపై మార్కింగ్ చేయడం, రాయడం వంటివి చేస్తే కాఫీ కింద పరిగణించాల్సి ఉంటుందని బోర్డు ప్రకటించింది. విద్యార్థులు క్వశ్చన్ పేపర్ పై ఎలాంటి నంబర్లు, రాయలు చేయొద్దని స్పష్టం చేసింది. ఏవైనా ప్రాక్టీస్ వర్క్, రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఆన్సర్ షీట్ కు కుడివైపున ఉన్న మార్జిన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుందని, అలా కాదని, పేపర్ మధ్యలో, ఎడమవైపు మార్జిన్ లేదా మరెక్కడైనా చేస్తే చర్యలుంటాయని, అలాంటి పేపర్ల మూల్యాంకనం చేపట్టమని స్పష్టం చేసింది. దీని వల్ల ఆన్సర్ షీట్లు మరింత స్పష్టంగా, పేపర్లు దిద్దే ఉపాధాయ్యులకు అర్థం అయ్యేలా ఉంటుందని అభిప్రాయపడింది.