ఐటీలో పని చేసే ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..
ఐటీ కంపెనీలతోపాటుగా బీపీవో సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జూలై 31 వరకు ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కల్పించింది. కొవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మంగళవారం రాష్ర్టాల ఐటీ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. వర్క్ ఫ్రం హోంకు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగియాల్సి ఉన్నది.
కానీ ఐటీ, బీపీవో కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ అనుమతిని జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. తమ ఉద్యోగులను, సిబ్బందిని దశలవారీగా మళ్లీ కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్న ఐటీ, బీపీవో సంస్థలకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని ‘నాస్కామ్' పేర్కొన్నది.