చంద్రబాబు ఇంటి వరకూ కరోనా, బందోబస్తు డ్యూటీ కానిస్టేబుల్ కి పాజిటివ్
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కట్టలు తెంచుకుని విజృంభిస్తుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను కూడా ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం తాడేపల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి.
పరిపాలనకు గుండెకాయగా భావించే సచివాలయాన్నీ కూడా కరోనా విడిచిపెట్టలేదు. డజనుకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సచివాలయంలో నమోదు అయ్యాయి.ఇక తాజాగా- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసం గుమ్మం వద్దకు చేరుకుంది కరోనా.
జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు సొంత ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. గుంటూరు జిల్లా బాపట్ల పోలీస్ స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా చంద్రబాబుకు చెందిన జూబ్లీహిల్స్ నివాసం వద్ద బందోబస్తు కోసం వెళ్లారు.