నెంబర్ ప్లేట్లు మార్చాల్సిందే..
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాత వాహనం అయినా రవాణాశాఖ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది. నంబర్ ప్లేటు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాలని అధికారులు ఆదేశించారు. దీనికి సంబంధించి రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్ కు కనిష్ఠంగా రూ.320, గరిష్ఠంగా రూ.800గా ధరలను నిర్ణయించారు.