కరోనా విలయం: భారత్‌లో భయానకం..

News Published On : Sunday, May 31, 2020 12:41 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 60లక్షలు దాటేసింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది అని విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా, 193 మంది మరణించారు.

ఇలా కేసులు పెరుగుతున్నా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వటం పైన కొంతమంది పెదవి విరుస్తున్నారు  కేసుల పెరుగుదలలో నిన్న సరికొత్త రికార్డు. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 1,82,143కు చేరింది. ఇందులో 5,164మంది ప్రాణాలు కోల్పోగా, 86,984 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 90వేల యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రానున్నవేళ కేంద్ర-రాష్ట్రాలు భారీగా సడలింపులు ప్రకటించాయి.

మిగతా దేశాలతో పోల్చుకుంటే అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కరోనా వ్యాప్తిని బాగా కంట్రోల్ చేయగలిగామని మోదీ అన్నారు. ప్రజలందరూ కలిసి పని చేయడం వల్లే, ప్రభుత్వానికి ప్రభుత్వం సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని, కరోనా క్రైసిస్ లో దేశం వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు మోడీ.

కరోనా విజృంభిస్తున్న వేళ దేశం నలుమూలలా వలస కూలీలు, పేదలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారన్న ఎం మోడీ వాళ్లను ఆదుకునే విషయంలో పౌరులు సేవా భక్తిని చాటుకున్నారని, పొరుగువాడికి సేవ చేయాలనే భావన మన సంస్కృతిలోనే ఉందన్నారు. వివిధ మార్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.