వీడియోలు పెట్టి మరీ పవన్ ను టార్గెట్ చేశారు
కాకినాడలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటుకు వెళ్లి వస్తూ కాకినాడ-రాజమండ్రి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ పాలకులు గతంలో రహదారిని పట్టించుకోలేదు కాబట్టే ప్రమాదానికి కారణం అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఎదురు విమర్శలకు దిగారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు బాగానే ఉందని కామెంట్లు చేస్తూ వీడియోలను కూడా పోస్టు చేస్తున్నారు. డిప్యూటి సీఎం పచ్చి అబద్దాలు ఆడుతున్నారని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.