SLBC టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత
SLBC టన్నెల్ నుంచి కొద్దిసేపటి కిందట ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని గుప్రీత్ సింగ్ గా భావిస్తున్నారు. ఆయన టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని గుర్తించనున్నారు. మృతుని కుటుంబీకులకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలుస్తోంది.