బట్టతలపై జుట్టు మొలిపిస్తారని ఆశతో వెళ్లారు.. చివరకు..
బట్టతలపై జుట్టు వస్తుందనుకుని ఆశతో వెళ్ళిన 67 మంది మోసపోయారు. పంజాబ్ లోని సంగ్రూర్లో ఇద్దరు వ్యక్తులు జుట్టు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. తాము అందించే నూనె వాడితే జుట్టు వస్తుందని చెప్పడంతో స్థానికులు నమ్మేసారు. వారి దగ్గర నూనె కొని వాడారు.
చివరకు ఆ నూనె వాడిన 67 మందికి వెంట్రుకలు రాకపోగా ఇన్ఫెక్షన్లు సోకి ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు శిబిరం నిర్వహించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి నైపుణ్యం, అనుమతి లేకుండా వారు శిబిరం నిర్వహించినట్లు తేల్చారు.