వైఎస్ జగన్ ఇంటిలో తీవ్ర విషాదం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ (85) బుధవారం పులివెందులలో కన్నుమూశారు. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్య క్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.