తన బిడ్డకు హింద్ పేరు పెట్టిన దుబాయ్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్, షేఖా షేఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మఖ్తూమ్ దంపతులు తమ నాలుగో బిడ్డకు 'హింద్' అని నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఆ పదానికి అర్థం 'సమృద్ధి' అని సమాచారం. శిశువుకు అమ్మమ్మ 'షేఖా హింద్ బింట్ మఖ్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్' పేరునే పెట్టడం విశేషం. 'దేవుడి ఆశీర్వాదంతో మాకు పుట్టిన నాలుగో బిడ్డకు హింద్ నామకరణం చేశాం' అని ప్రిన్స్ తెలిపారు.