ఏపీలో మళ్లీ భూకంపం - పరుగులు తీసిన ప్రజలు
ఏపీలో ఈ మధ్య కాలంలో భూకంప భయాందోళనలు కలకలం సృస్టిస్తున్నాయి. ఇవాళ ప్రకాశం జిల్లాలో భూమి ఓ రెండు సెకన్ల పాటు కంపించింది. ముండ్లమూరు మరియు తాళ్ళూరు మండలాల్లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా వీధుల్లోకి పరుగెత్తారు. శంకరాపురం, వేంపాడు, గంగవరం, పసుపుగుళ్లు,తాళ్లూరు, రామభద్రాపురం మరియు పోలరం గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.