Breaking: మరో భూకంపం

News Published On : Sunday, March 30, 2025 06:55 PM

మరో దేశాన్ని భూకంపం వణికించింది. పసిఫిక్ ద్వీప దేశం టొంగాలో ఆదివారం భూమి కంపించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలు కథనాల్లో పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు తెలిపాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. రెండు రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.