జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ
వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (బుధవారం) 10.30గంటలకు గుంటూరులోని మిర్చి యార్డులో పర్యటించి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా నిలబడతారని ఆ పార్టీ ట్వీట్ చేసింది. పెట్టుబడి రాలేదని మిర్చి రైతులు దిగాలు చెందారని, వారితో మాట్లాడి భరోసా కల్పిస్తారని తెలిపింది.
మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం కన్నీరు మిగిల్చిందని ఆరోపించింది. అయితే MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు ఎన్నికల సంఘం (EC) అనుమతి నిరాకరించింది.