ముగిసిన దరఖాస్తు గడువు.. రూ.250 ఫైన్ తో అవకాశం..
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్నికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఇంజినీరింగ్ కు 2,10,567, అగ్రికల్చర్, ఫార్మసీకి 81,172 దరఖాస్తులు, మొత్తం 2,91,965 దరఖాస్తులు అందాయని ఎప్ సెట్ కన్వీనర్ ఆచార్య బి.డి. కుమార్ తెలిపారు. అయితే విద్యార్థులు రూ.250 ఆలస్య రుసుంతో ఈ నెల 9 వరకు తరువాత రూ.5 వేలతో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.