Breaking: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయనను అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైసీపీలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ మంచి మిత్రులు.