అంతా అమృతనే చేసింది.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా అంటూ అమృత చెల్లి ఆవేదన
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా A6గా ఉన్నాడు. ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో శవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు, అమృత తండ్రైన ఏ1 మారుతీ రావులు అన్నదమ్ములు.
పోలీసులతో శ్రవణ్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్ కూతురు బోరున విలపించింది. ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఇరికించిందని ఆరోపించింది. దీనికి అంతటికి కారణం అమృతనే అని ఆమె చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి నుంచి కూడా శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబం వాదిస్తోంది.