విద్యార్థిని పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్.. తరగతి గదిలోనే వివాహ తంతు..
తరగతి గదిలో ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్ విద్యార్థిని పెళ్లాడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో ఉన్న మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనలో అది భాగమని ఆ ప్రొఫెసర్ చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై యూనివర్సిటీ బుధవారం విచారణకు ఆదేశించింది.
ఆమె నుంచి వివరణ కోరిన అధికారులు విచారణ ముగిసేదాకా సెలవుపై వెళ్లాల్సిందిగా కోరారు. సంబంధిత విద్యార్థికి కూడా ఇదేవిధంగా సూచించారు. నవవధువులా అలంకరణలో ఉన్న ప్రొఫెసర్‌కు, ఫస్టియర్ విద్యార్థికి నడుమ జరిగిన ఈ తంతులో హిందూ బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం.. 'సిందూర్ దాన్', 'మాలా బదలా' (పూలదండలు మార్చుకోవడం) వంటి క్రతువులన్నీ జరిగినట్లు ఆ వీడియోలో ఉంది.