Breaking: గోవాలో తెలుగు నిర్మాత ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ నిర్మాత కృష్ణప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రాముల కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.