ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

News Published On : Friday, April 4, 2025 08:36 AM

ఏపీ సచివాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.