పరారీలో వైసీపీ మాజీ మంత్రి కాకాని
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అక్రమ మైనింగ్ విషయంలో ఆయన సోమవారం పోలీసు విచారణకు హాజరు కాని విషయం తెలిసిందే. కాకాణి కోసం హైదరాబాద్ లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లో కాకాణి ఉండే 3 ఇళ్లకు నెల్లూరు పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చేసరికి కాకాణి పరారయ్యారని తెలుస్తోంది. కాకాణి లేకపోవడంతో ఆయన బంధువులకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.