వైసీపీలో చేరిన మాజీ మంత్రి
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలోకి చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు.
శైలజానాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ప్రజల తరుపున వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైఎస్సార్సీపీలోకి చేరానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని చెప్పారు.