సీఐడీ విచారణకు విజయసాయి రెడ్డి
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అక్రమంగా కాకినాడ పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని విజయసాయి రెడ్డిపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.