మాకు ఉచిత బస్సు పథకం వద్దు బాబోయ్!!
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను 15% పెంచడంపై కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ ధరలు పెంచుకుంటూ పోతే మేము ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు ఫ్రీ బస్సు స్కీమ్ అవసరం లేదని, టికెట్ ఛార్జీలను పెంచవద్దని పలువురు మహిళలు కోరుతుండటం గమనార్హం.
పురుషులూ తమ కుటుంబాల్లోని సభ్యు లేనని, ఛార్జీలు పెంచితే భారం పడేది తమ కుటుంబాల పైనేనని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.