తెలంగాణలో కొత్త వ్యాధి.. తొలి కేసు నమోదు

News Published On : Friday, January 31, 2025 01:00 PM

గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తెలంగాణకు వ్యాప్తి చెందింది. ఆ వ్యాధి తొలి కేసు నమోదైంది. మహారాష్ట్రలో ఆ వ్యాధి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె హైదారాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదని, త్వరగా నయం చేయవచ్చని అంటున్నారు.