భారీగా తగ్గిన బంగారం ధరలు
కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (శనివారం) తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1000 తగ్గి రూ.78,900లకు చేరింది.
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1090 తగ్గడంతో రూ.86,070కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది