స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.87,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.95,660కి చేరింది. ఇటు, కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా కొనసాగుతోంది.