భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా తగ్గాయి. దీంతో సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.980 తగ్గి రూ.90,660కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.83,100గా ఉంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం ధర రూ.2720 తగ్గడం విశేషం.