మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. ఒకసారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.79,400లకు చేరింది.
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,08,000గా ఉంది.