3 వేలు కడితే.. దేశంలో ఏ టోల్ గేట్ అయిన పైసా లేకుండా దాటొచ్చు
జాతీయ రహదారులపై ప్రయాణం చేసే కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోన్నట్లు సమాచారం. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30వేలతో పాసులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లెనా తిరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.