ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2025 అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. తాజాగా ఎయిర్టెల్ తమ కస్టమర్లకు, క్రికెట్ ప్రియులకు కిక్కిచే ఆఫర్ అందించింది. కేవలం రూ. 451 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో JioHotstarకి యాక్సెస్ అందించడమే కాకుండా భారీగా డేటా కూడా వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ ప్లాన్. ఇందులో ఎలాంటి కాల్స్, మెసేజ్ ప్రయోజనాలు ఉండవు.