SBI కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో రుణ రేట్లలో కోత విధించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు, ఎక్స్టెర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రెపో లింక్ రేటు 8.25 శాతానికి తగ్గింది. ఈబీఎల్ఆర్ 8.65 శాతానికి ఎస్బీఐ తగ్గించింది. అయితే ఈ రేట్లు అన్ని కూడా ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.