నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఇంతవరకు ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించారు. ఇక మీదట ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా, తెలంగాణలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.