సోనూసూద్ ఫౌండేషన్ కు కేంద్రం గుడ్ న్యూస్... లైసెన్స్ మంజూరు
ప్రముఖ హీరో సోనూసూద్ ఫౌండేషన్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 'సూద్ చారిటీ ఫౌండేషన్'కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ ఆర్ సి ఎ) లైసెన్సును మంజూరు చేసింది.
ఈ లైసెన్సు పొందిన స్వచ్ఛంద సంస్థలు ఐదేళ్ల పాటు విదేశీ నిధులను స్వీకరించేందుకు, వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక సేవ చేయడం, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందాలనేదే తమ లక్ష్యమని సూద్ ఫౌండేషన్ వెల్లడించింది. కొవిడ్ టైంలో సోనూసూద్ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను దోచుకున్న సంగతి తెలిసిందే.