వేసవి సెలవులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
తెలంగాణలో ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ల కు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23న విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. జూన్ 12న తిరిగి స్కూళ్లు పూనఃప్రారంభించాలని తెలిపింది. ఇక అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు ప్రకటించింది.