అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా వలసదారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజగా మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్న్మెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది.