పిటిషనర్ కు హైకోర్టు షాక్..రూ.కోటి జరిమానా
తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి కోర్టు తనదైన రీతిలో బుద్ధి చెప్పింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్ ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్ కు హైకోర్టు చెక్ పెట్టింది.