పథకాల కోసం ఆలయాలను డబ్బులు అడిగిన ప్రభుత్వం
సుఖ్ అభయ్ పథకం కోసం ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఖాళీ అయింది.
నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ బీజేపీ ఆందోళనకు దిగడంతో సీఎం సుఖ్వీందర్ సింగ్ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.