పేరు మరిచిపోయినందుకే అరెస్ట్ చేశారా? సీఎం రేవంత్
హీరో అల్లు అర్జున్ పుష్ప-2 ఈవెంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరచిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి నిజంగానే పేరు మరిచిపోయినందుకే బన్నీని అరెస్ట్ చేశారా అన్న దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరో నా పేరు మరిచిపోతే నేను ఫీల్ అవుతా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీపుడ్ మీద ఉంది కదా? అని సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలి అనే కోరుకునే వ్యక్తిని అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.