బెస్ట్ ముఖ్యమంత్రుల సర్వే.. చంద్రబాబు ర్యాంక్ ఇదే
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాలుగో స్థానంలో నిలిచారని టీడీపీ ట్వీట్ చేసింది. గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో ఉన్న ఆయన తాజా సర్వేలో 4వ స్థానాన్ని పొందారని తెలిపింది.
కాగా తొలి మూడు స్థానాల్లో వరుసగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఉన్నారు. 5, 6 స్థానాల్లో ఫడ్నవీస్, సిద్దరామయ్య నిలిచారు.