తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ పై IRCTC క్లారిటీ
రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలా జరుగుతున్న ప్రచారం ఫేక్ అని IRCTC స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్ కు సంబంధించి టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.
ట్రైన్ బయలుదేరే ముందు రోజు తత్కాల్ బుకింగ్ చేసుకునేవారికి ఏసీకి సంబంధించి ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్ కు సంబంధించిన ఉదయం 11 గంటలకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని తెలిపింది.