ఇస్రో సెంచరీ : వందో ప్రయోగం విజయవంతం
ఇస్రో సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించింది. శ్రీహరి కోటలోని షార్ ప్రయోగించిన వందో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 గంటలకు GSLV-F 15 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్ళింది. NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దానిపై షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
2,250 కేజీల బరువున్న ఈ శాటిలైట్ ను యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది. ఇది పదేళ్లపాటు భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలు అందించనుంది.