జగన్ వల్లే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది

News Published On : Thursday, January 9, 2025 12:34 PM

జగన్ ప్రభుత్వం తెచ్చిన టోకెన్ల సిస్టం వల్ల ప్రమాదం జరిగిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపరులో వచ్చిన వార్తల మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన టోకెన్ సిస్టమ్ వలనే ఈ ఘటన జరిగినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వార్తలు ప్రచురించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు చైర్మన్ ను నియమించి రెండు నెలలు అయింది. 

నిన్న జరిగిన దుర్ఘటన కు కూడా జగన్ కారణం అన్నట్లు జగన్ ప్రభుత్వంలో తెచ్చిన టోకెన్ల సిస్టం తంటా తెచ్చినట్లు మీరు రాసిన రాతలు కడు జుగుప్సాకరం.

కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్ అధికారంలో ఉండగా టీటీడీలో తీసుకున్న అనేక నిర్ణయాలపై సమీక్షించి మార్పులు చేశారు. మరి ఈ టోకెన్ల సిస్టం ఎందుకు మార్చలేదు?

మంచి జరిగితే కూటమి ప్రభుత్వం గొప్ప. చెడు జరిగితే జగన్ కారణం అనే మాటలు రాతలు కట్టి పెట్టండి.అయిన మీ రాతలు టిడిపి కూటమి నేతలు కూడా నమ్మడం లేదని మీకు తెలుసు.

ప్రభుత్వం మారి 7 నెలలు అయిన ఎక్కడా ప్రభుత్వంలో మార్పు లేదు. క్షేత్ర స్థాయిలో తప్పులు జరుగుతున్న జగన్ మీద వేసుకుంటూ పోతే ఎలా అని వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.