పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన జగన్
సింగపూర్ లో అగ్ని ప్రమాద సంఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.
ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు చేశారు. ఇది ఇలా ఉండగా చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాద సంఘటన తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరారు. మన్యం జిల్లా పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు అలాగే కాళ్లకు తీవ్రమైన గాయాలు అయినట్లు చెబుతున్నారు. సింగపూర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది.