జనసేనకు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ పంతం నెరవేరింది

News Published On : Tuesday, January 21, 2025 11:15 PM

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలోకి జనసేనను చేర్చింది. జనసేనకు గాజుగ్లాసు గుర్తు రిజర్వ్‌ చేస్తూ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాసింది. ఇటీవలే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే.