విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణలో డిగ్రీల ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. www.jntuh.ac.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.