వంశీ కేసులో కీలక పరిణామం

News Published On : Monday, February 17, 2025 04:00 PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్ను పోలీసులు సోమవారం కోర్టుకు తీసుకురానున్నారు. 164 కింద స్టేట్మెంట్ నమోదు చేయాలని అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు ఇప్పటికే 161 కింద స్టేట్మెంట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా, చీప్ మెట్రో పోలీస్ కోర్టు న్యాయమూర్తి సోమవారం స్టేట్మెంట్ నమోదు చేయాలని కోర్టును ఆదేశించనున్నారు.