మందుబాబులకు షాక్.. పెరగనున్న ధరలు..

News Published On : Tuesday, February 4, 2025 09:45 AM

తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. KF బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ధరల పెంపునకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల డిమాండ్ పెరిగే చాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే ఈ వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టు బీర్లు సరఫరా చేసి రాష్ర్ట ఖజానాను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఒక్కో కింగ్ ఫిషర్ బీర్ పై రూ.20-25 పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కానీ, రేట్ల పెంపు విషయంలో రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారిక వర్గాల సమాచారం.

యునైటెడ్ బ్రూవరీస్ ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, తెలంగాణ బివరెజేస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్) ధరలు 2019 నుంచి పెంచడం లేదని పేర్కొంటూ యూబీ సంస్థ తయారీ నిలిపివేస్తున్నట్టు తొలుత ప్రకటించింది. మరల దిగొచ్చి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే యూబీ బీర్లపై ధరలు పెంపునకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. యూబీ సంస్థ 33 శాతం ధరలు పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం 10-15 శాతం మాత్రమే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుస్తోంది.