వీడియో లీక్ చేస్తావా.. నిన్ను చంపుతా: కిరణ్ రాయల్
తనను శారీరకంగా వాడుకుని వదిలేసి మోసం చేసాడని తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేయడం, మహిళతో రాసలీలల వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది. 'నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..' ఆ మహిళను ఫోన్ లో బెదిరించారు.
తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిరణ్‌రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.
ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్‌కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని తెలిపారు. కిరణ్‌రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్‌రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు.